మోడల్ స్కూల్‌లో ప్రవేశ పరీక్ష
– 16న తేదిన నిర్వహణ
– ప్రకటించిన జినుగుర్తి ప్రిన్సిపల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం జినుగుర్తిలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ వై.ప్రకాష్ గౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7వ తరగతి నుంచి 10వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తి చేయడంలో భాగంగా దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఈ ప్రవేశాల కోసం ఈనెల 16న తాండూరు మండలం జినుగుర్తిలోని మోడల్ స్కూల్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. 7 వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, కేంద్రానికి వచ్చే సమయంలో ఆధార్ కార్డు జిరాక్స్, హాల్ టిక్కెట్టు తీసుకరావాలని సూచించారు.

