ఆటో నగర్‌కు లైన్ క్లియర్..!
– త్వరలో ఏర్పాటుకు కృషి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చాలా కాలంగా పెండింగ్ లో ఉండిపోయిన ఆటో నగర్‌కు లైన్ క్లియర్ చేసి త్వరలో ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని కోకాపేట్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూరు మెకానిక్ అసిసోయేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

తాండూరులో ఆటో నగర్ లేక ఇబ్బందులు పడుతున్నామని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ తాండూరులో ఆటో నగర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో అన్ని ఆధునూతన వసతులతో ఏర్పాటు చేసేందుకు దృష్టిసారిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, మసూద్, అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

