బడుగు బలహీన వర్గాల ధీరోత్తముడు అంబేద్కర్

తాండూరు రాజకీయం వికారాబాద్

బడుగు బలహీన వర్గాల ధీరోత్తముడు అంబేద్కర్
– అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మించుకుందాం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె.రాజ్ కుమార్
– తాండూరులో అంబేద్కర్‌కు ఘన నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ధీరోత్తముడు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా జై భీమ్ ఉత్సవ కమిటీ, బీసీ సంఘం, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్, డాక్టర్ సంపత్ కుమార్‌ తదితరులతో కలిసి విగ్రహానికి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అదేవిధంగా జై భీమ్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు అనేక సంస్కరణలు తీసుకవచ్చారని అన్నారు. అంతేకాకుండా రాజ్యాంగంలో వారి హక్కులను పొందపరచి బడుగు బలైన వర్గాల తలరాతను మార్చిన మహనీయుడు అని అభివర్నించారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు ని కల్పించి అతి పౌరునికి గొప్ప ఆయుధాన్ని ఇచ్చిన ధీరోత్తముడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ కలలు కన్నా సమాజాన్ని నిర్మించుకోవడంలో యువత, మహిళలు, ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సోమశంకర్, సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్, పీడీఎస్‌యూ అధ్యక్షులు శ్రీనివాస్, జై భీమ్ సభ్యులు జూటుపల్లి వెంకట్, శివ, స్వేరో సాయి, నవీన్, ఎల్లప్ప, సురేందర్, బీసీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సుకూర్, ప్రజా సంఘాల నాయకులు చెంగోల్ వెంకట్, చంద్రయ్య, బసయ్య, టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయులు నారాయణ గౌడ్, శ్రీనివాస్, నర్సింలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.