ఇఫ్తార్ విందుకు తరలిరండి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇఫ్తార్ విందుకు తరలిరండి
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) శనివారం ఓ ప్రటకలో తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే ఇప్తార్ విందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకు తాండూరు ముస్లిం సోదరులు భారీగా తరలిరావాలని కోరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.