హరతి పళ్లెంలో అద్బుతం..

జాతీయం తెలంగాణ హైదరాబాద్

హరతి పళ్లెంలో అద్బుతం..
– తనంతట తానే కదిలిన వైనం
– హనుమాన్‌ టెంపుల్‌లో మహిమాన్విత దృశ్యం
– వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: మహిమాన్విత దేవాలయాల్లో జరిగే ఎన్నో అద్భుతాలను చూస్తుంటాము.. తెలుసుకుంటాము. అలాంటి అద్బుతాల గురించి ఇతరులకు చెబుతూ ఉంటాం. సరిగ్గా అలాంటి దృశ్యాన్ని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో అద్భుతం జరిగింది. బైంసా పట్టణంలోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో హారతి పళ్ళెం తనంతట తానే కదలడంతో భక్తులు విస్తుపోయారు. ప్రతిరోజు మాదిరిగానే ఏప్రిల్‌ 15 శనివారం రాత్రి అర్చకులు పూజలు నిర్వహించి, స్వామివారికి హారతి ఇచ్చారు. తర్వాత భక్తులకు హారతి చూపించి యధావిధిగా స్వామివారి ముందు హారతి పళ్లాన్ని ఉంచారు.

హారతి పళ్లెం అలా కింద పెట్టగానే తనకు తానుగా పళ్లెం కదలడం మొదలుపెట్టింది. ఏకంగా నాలుగు నిమిషాల పాటు ఆ పళ్లెం కదులుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ దృశ్యాన్నిచూసి భక్తలు భక్తి పారవశ్యంతో పొంగిపోయారు. అదంతా హనుమంతుడి మహిమేనని చెబుతున్నారు. స్వామి అనుగ్రహం ఈ రూపంలో చూపించారన్నారు. హారతి పళ్లెం కదులుతున్న వీడియో నెట్టింట చేరి వైరల్‌ అవుతోంది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు పరవశానికి లోనవుతున్నారు. వీడియో ఉంది చూడండి…