రైలు పట్టాలపై మృత్యుకేళీ..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

రైలు పట్టాలపై మృత్యుకేళీ..!
– ఒడిశా ఘటనలో 278కి చేరిన మృతల సంఖ్య
– ప్రమాదంపై విచారణ చేస్తున్న అధికారులు
– రక్తదానంతో మానవత్వం చాటుకున్న మనషులు
దర్శిని డెస్క్‌: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లాలో రైలు పట్టాలపై మృత్యుకేళీ.. ఆర్థనాదాలు ఆగడంలేదు. పట్టాలపై సంభవించిన మృత్యుఘోషలో మృతుల సంఖ్య 278 మందికి చేరింది. అదేవిధంగా వందల మంది గాయపడగా.. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ బోగీల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌ ముమ్మరంగా గాలిస్తోంది. అటు భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 1200 మంది సిబ్బంది ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాగా ఈ రైలు ప్రమాదంలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదానికి కారణాలపై విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


ప్రమాదం ఎలా జరిగిందంటే..?
స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ కథనం మాత్రం మరోలా ఉండటం గమనార్హం. తొలుత కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిందని అమితాబ్‌ చెప్పారు. దాని 10-12 బోగీలు బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్‌ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తాపడ్డాయని వివరించారు.


రక్తదానంతో మానవత్వం
పెనువిషాధాన్ని నింపిన రైలు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడుకునేందుకు అందరు తోడ్పాటు అందిస్తున్నారు. క్షతగాత్రులను బాలేశ్వర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ పరిస్థితుల్లో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువకులు నిన్న రాత్రే బాలేశ్వర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వీరంతా ఏ పిలుపూ లేకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి మరీ.. క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి…
జర్రయితే.. కాటేసేది..!
– పాము నుంచి తప్పించుకున్న బాలిక
– వైరల్ అయిన వీడియో


https://dharshininews.com/17493

chaithany collage