పిల్లి కోసం కోతి సాహసం
– బావిలో పడిన మూగజీవిని కాపాడిన వైనం
– సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో
దర్శిని డెస్క్: చేతిలో సెల్‌ఫోన్ ఉన్నవాళ్లు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుంటారు. అందులో కొన్ని తెగ వైరల్ అతుంటాయి. ఫన్నీ, లవ్, టెక్నిక్స్ వంటివి ఉంటాయి. అప్పుడప్పుడు మూగజీవాలకు సంబంధించి మానవత్వం వీడియోలు ఆకర్షణా నిలుస్తాయి. అలాంటి కోవలో ఓ కోతి జాతి వైరం మరిచి పిల్లి కోసం సాహసం చేసింది. ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వీడియోలో ఒక పిల్లి పాడుబడిన బురద బావిలో పడి ఉంటుంది. గమనించిన ఓ కోతి దానిని కాపాడేందుకు వెంటనే ఆ బావిలోకి దూకుతోంది. బురదలో మునిగిపోయిన పిల్లిని కోతి తన రెండు చేతులతో పైకి ఎత్తుకుంది. ఆ పిల్లిని కాపాడానికి ఆ వానరం చాలా సేపు శ్రమపడుతోంది. చివరకు దాని ప్రయత్నం ఫలించకుండా పోతోంది. దాంతో ఆ వానరం మరొక కోతిని సహాయం చేయమని కోరినట్టుగా కనిపించింది. కానీ అది కూడా భయపడి అక్కడ్నుంచి నుండి పారిపోయినట్లు అనిపించింది.
అంతలోనే ఓ చిన్నారి ఆ మూగజీవాల పట్ల రక్షకురాలిగా వచ్చింది. ఆమె బురద బావిలోకి దిగి, పిల్లి పిల్లను బయటకు లాగడంతో కోతి ఆందోళన తీరింది. ఆ అమ్మాయి బురద బావిలోంచి పిల్లి పిల్లను బయటకు తీయగానే, కోతి వెంటనే ఆ పిల్లిని తన చేతుల్లోకి లాక్కుని దగ్గరకు తీసుకుంది. తరువాత అక్కడున్న పెద్దవారు పిల్లికి అంటిన మురికిని, మట్టిని వదిలించుకోవడానికి పిల్లి పిల్లను టవల్‌తో తుడవడం కనిపించింది. అయితే కోతి వణుకుతున్న పిల్లిని ఆప్యాయంగా లాలించడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో ట్విటర్ వేదికగా అందరినీ ఆకట్టుకుంది. కోతి చూపించిన దయకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.
Witness the most heartwarming monkey rescue ever! 🐵❤️ pic.twitter.com/IaRgWUzwUz
— Tansu Yegen (@TansuYegen) April 16, 2023

