నాలుగు పులులకు తల్లైన కుక్క
– పాలిచ్చి పెద్ద చేసిన మానవత్వం
– పెద్దైన పులులు కుక్క తల్లితో స్నేహం
– సోషనల్ మీడీయాలో వైరల్ అయిన వీడియో
దర్శిని డెస్క్: జంతువులు, మూగ జీవాల జాతి వైరం మరిచిన వీడియోలు ఎన్నో చూసే ఉంటాం. అలాంటి వీడియోలు ఎప్పుడూ మనసుకు అత్తుకుంటాయి. అయితే నాలుగు పులులకు తల్లిగా మారిన ఓ కుక్క వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో ఉన్న దాని ప్రకారం.. చిన్నతనంలో ఉన్న పులి పిల్లలకు పాలిచ్చి, వాటి అలనాపాలనా చూసుకుంటుంది. సాధారణంగా ఏ జంతువైనా పులిని చూస్తే.. చూసిన పరిసరాలలో కనిపించకుండా పరుగులు తీస్తుంది. కానీ వీడియోలోని కుక్క మాత్రం వాటికి పాలివ్వడంతో పాటు, వాటి సంరక్షణా బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. అవి అలాగే పెద్దయ్యే దాకా వాటి పోషణను నిర్వహిస్తుంది. ఆ క్రూర మృగాలు పెద్దయిన తర్వాత కూడా తమకు తల్లిగా బాధ్యతలు నిర్వహించిన ఆ కుక్కను ఏమి చేయకుండా ఉండడం ఆశ్చర్యకరమైన దృశ్యం. ఇంకా ఒక సమయంలో రెండు పులులు కొట్టుకుంటుంటే ఆ తల్లి కుక్క వాటిని వారించేందుకు ఒక పులిపై పడి ఆపుతుంది. ఇలా సాగిన ఈ వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇలా అరుదైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడంతో పాటు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో కోసం కింద ఇన్‌స్టా లింక్‌ను క్లిక్ చేయండి.

