తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
– ఈనెల 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ
– ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి నిర్వహించే టెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అవకాశం కల్పించారు. టెట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం. రెండో టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది.
ఇదికూడా చదవండి…

