కాడెద్దులపై పిడుగు పాటు
– రైతుకు రూ. 1.50లక్షల నష్టం
– యాలాల అక్కంపల్లి ఘటన
యాలాల, దర్శిని ప్రతినిధి : పిడుగు పాటుతో కాడెద్దులు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన అశోక్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తనకున్న రెండు ఎద్దులను పాకలో కట్టేశారు. రాత్రి ఆకాశమత్తుగా పిడుగు పడడంతో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రెండు ఎద్దుల మృతి తో రైతుకు రూ. 1.50 లక్షల నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

