వాట్సాప్‌లో కొత్త ఫీచర్
– చాట్ హిస్టరీ చూడకుండా ఆప్షన్
– ‘చాట్ లాక్’తో ఉపయోగం
దర్శిని డెస్క్: కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకవచ్చింది. ఇందులో వినియోగదారులు చాల ఉపయోగమైన భద్రత, ప్రైవసీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదేంటంటే ‘చాట్ లాక్’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఉదహరణకు ఎవరైనా మీతో చాట్ చేసినా.. లేదా వారి నుంచి వచ్చే ఫోటోలు మరెవరూ చూడకూడదు అనుకుంటే ఈ చాట్ లాక్‌ను యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ మొత్తం యాప్ ను లాక్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక చాట్ నే లాక్ చేసుకొనే సౌకర్యం ఇందులో ఉంటుంది. దీని వినియోగంతో ఎవరి చాట్ అయితే వేరే వాళ్లు చూడకూడదు అని భావిస్తారో వారిది లాక్ చేసుకోవచ్చు. అలాగే వారి నుంచి వచ్చే చిత్రాలు, వీడియోలను కూడా ఎవరికీ కనబడకుండా చేసుకోవచ్చు. కొన్ని రిపోర్టుల ప్రకారం.. వాట్సాప్ బీటా టెస్టర్లకు మాత్రమే ఈ చాట్ లాక్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
ఇది మీ యాప్ మొత్తాన్ని లాక్ చేయకుండా కేవలం మీకు అవసరమైన చాట్ ను మాత్రమే లాక్ చేసేందుకు ఉపకరిస్తుంది. మీరు ఒకవేళ ఈ ఫీచర్ కావాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి అప్ డేట్ కోసం చూడొచ్చు. ఈ కొత్త అప్ డేట్ లో వినియోగదారులకు పూర్తి సౌకర్యాన్ని ఇస్తుంది. వాట్సాప్ మొత్తాన్ని లాక్ చేసుకోకుండా కేవలం కొన్ని చాట్లను మాత్రమే లాక్ చేసుకొనే వెసులుబాటు మీకు కలుగుతుంది. మీ ప్రైవసీని కాపాడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫీచర్ పొందడం ఇలా..
వాట్సాప్ అప్ డేట్ చేశాక.. మీరు వాట్సాప్ కాంటాక్ట్ లోని ప్రోఫైల్ సెక్షన్ లోకి వెళ్లాలి. దానిలో కిందకి వెళ్తే వచ్చిన ఆప్షన్లలో ‘చాట్ లాక్’ అలే కొత్త ఫీచర్ మీకు కనిపిస్తుంది.
ఇప్పుడు మీరు దానిని ‘లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్’ అని ఆప్షన్ ని ఎంపిక చేసుకొని ఎనేబుల్ చేసుకోవాలి.

ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. కానీ కొన్ని బీటా వెర్షన్లలో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్లే స్టోర్ కి వెళ్లి అప్ డేట్ కోసం సెర్చ్ చేయవచ్చు.

