పిడుగు పగకు మూగజీవాలు బలి..!
– యాలాల మండలంలో ఐదు మేకల మృతి
– పరిశీలించిన పశువైద్యాధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పిడుగు మనుషుల మీదనే కాకుండా మూగ జీవాలపై కూడా పగబట్టింది. ఇప్పటి వరకు మనషుల మరణానికి కారణమైన పిడుగు పాటు మృత్యువు తాజాగా మూగజీవాలను వెంటాడింది. ఈ సంఘటన యాలాల మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన గురుపెద్ద మొగులప్ప మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు.
సోమవారం రోజు మాదిరిగానే మేకలను మేపేందుకు తీసుకెళ్లాడు. సాయంత్రం కురిసిన అకాల వర్షంలో పిడుగు పడి ఆయనకు చెందిన 5 మేకలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి శ్రీకర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన ప్రమాదంలో బాధిత యజమాని మొగులయ్య తనకు తీవ్ర నష్టం జరిగిందని, పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


ఇదికూడా చదవండి…

