రేపు తాండూరులో పవర్‌ కట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరులో పవర్‌ కట్..!
– పలు మండలాల్లో సరఫరా నిలిపివేత
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంతో పాటు పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. శనివారం తాండూరు డీఈ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9-30 గంటల నుంచి మధ్యాహ్నం 3-30 గంటల వరకు విద్యుత్ సరఫరా స్థంభించి పోతుందన్నారు. తాండూరు నియోజకవర్గంలోని 33/11కేవీ సబ్‌ స్టేషన్‌లు అయిన పెద్దేముల్, యాలాల, బషీరాబాద్‌ మండలాలతో పాటు కోట్‌పల్లి, ధారూర్, బంటారం మండలాల్లో పవర్‌ కట్ ఉంటుందన్నారు. 220/132/33కేవీ సబ్‌ స్టేషన్‌లో మరమ్మత్తుల నేపథ్యంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులు, ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.