ఉప్పల గొప్ప మనసు..!
– పేద వైశ్యుడి వైద్యానికి చేయూత
– రూ. 15 వేలు అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
– కృతజ్ఞతలు తెలిపిన ఐవీఎఫ్ యూత్ సెక్రటరి రొంపల్లి సంతోష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, టూరీజం కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త స్థాపించిన ఉప్పల ఫౌండేషన్ ద్వారా తాండూరులోని పేద వైశ్యుడికి చేయూత అందించి గొప్ప మనసు చాటుకున్నారు. పట్టణానికి చెందిన సాతెల్లి అంజయ్య అనే పేద వైశ్యుడు హెర్నియాతో బాధపడుతూ అనారోగ్యానికి గురయ్యారు.

పట్టణంలోని శ్రీ శివ నర్సింగ్ హోంలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర యూత్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్ ద్వారా ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేయూతనందించే ందుకు ముందుకు వచ్చారు. ఉప్పల ఫౌండేషన్ ద్వారా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సాతెల్లి అంజయ్య చికిత్సకు రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం శ్రీనివాస్ గుప్త ఆదేశాల మేరకు ఐవీఎఫ్ రాష్ట్ర యూత్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దీంతో పాటు ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆసుపత్రి వైద్యులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆపదో ఉన్న పేద వైశ్యుడికి ఆర్థిక చేయూతను అందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తకు రొంపల్లి సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో కూడా ఉప్పల ఫౌండేషన్ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి…
హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..!
– వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు
– కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
https://dharshininews.com/17144

