రైతులకు గుడ్ న్యూస్..!
– వచ్చే వారమే పీఎం కిసాన్ డబ్బులు
దర్శిని డెస్క్: కేంద్రం రైతుల కోసం తీసుకువచ్చిన పథకాల్లో పీఎం కిసాన్ (PM Kisan) సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున అందిస్తోంది. ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఏడాదికి మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 10 విడతల వారిగా కిసాన్ డబ్బులను చెల్లించింది. 11వ విడత డబ్బుల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం రైతులకు 11వ విడత డబ్బులు చెల్లింపుపై శుభవార్తను చెప్పనుంది. ఈ 11వ విడత డబ్బులు మే నెల రెండోవారంలో రైతులు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోండి ఇలా
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను తెరవాలి. హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బెనిఫిసరి లీస్ట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా/ సబ్ జిల్లా, ఊరు వివరాలను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత రీపోర్ట్ గెట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. పేజీపై కనిపించే లబ్దిదారుల జాబితాపై క్లిక్ చేయాలి. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత pmksny హోమ్ పేజీకి తిరిగి వెళ్లాలి. మరోసారి బెనిఫిసరి స్టేటస్ పై క్లిక్చేయాలి. మీ ఆధార్ కార్డు వివరాలు, మొబైల్ నంబర్, అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. గెట్ డేట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చెక్ చేసుకోవాలి.

