సీఎం కప్ పోటీల విజయవంతానికి చర్యలు

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం కప్ పోటీల విజయవంతానికి చర్యలు
– మండల స్థాయి ఏర్పాట్లు పరిశీలించిన కమిటి సభ్యులు
– ఈనెల 15 నుంచి పోటీలు ప్రారంభం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఈనెల 15 నుంచి తాండూరు మండల స్థాయిలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల విజయవంతానికి పక్కా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కమిటి సభ్యులు తెలిపారు. ఈనెల 15వ తేది నుంచి తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల నిర్వహణకు కమిటి చైర్మన్ గా ఎంపీపీ అనితా గౌడ్, కన్వీనర్ గా ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి, సభ్యులుగా జెడ్సీటీసీ గౌడి మంజుల, తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, ఎంఈఓ వెంకటయ్య, మున్సిపల్ అధికారులను ఇదివరకే ఎన్నుకున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్ మైదానాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు మండల స్థాయిలో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు తీసుకోవడం జరుగుతుందన్నారు. దాదాపు క్రీడా కారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావా వస్తుందని తెలిపారు. 15 ఏండ్ల నుంచి 35 ఏండ్ల మద్య క్రీడాకారులు పోటీలో పాల్గొంటారని, క్రీడా పోటీల విజయవంతం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి…
హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..!
– వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు
– కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
https://dharshininews.com/17144