బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నరేందర్ గౌడ్
– ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ సలీం
– నియామకపత్రం అందించిన రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ నేతల, కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడింట్ గా వరుకుల నరేందర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ సలీంలను నియమించారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా నరేందర్ గౌడ్, అబ్దుల్ సలీంలు మాట్లాడుతూ పదవులు అప్పగించడం పట్ల రోహిత్ రెడ్డికి పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, జిల్లా గ్రం థాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), ఫ్లోర్ లీడర్ శోభారాణి, నాయకులు విజయ్ కుమార్, కౌన్సిలర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

