కాళ్లకు కరెంటు చెప్పులు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

కాళ్లకు కరెంటు చెప్పులు..!
– అమ్మాయిల కోసం రూపకల్పన
– ఆకతాయి వేషాలేస్తే అంతే సంగతులు
– చెప్పుల ధర కూడా అందుబాటులోనే
దర్శిని డెస్క్: కాళ్లకు కరెంటు చెప్పులు ఏంటి అని అనుకుంటున్నారా..! ఆపదలో ఉన్న అమ్మాయిలు తమను తాము రక్షించుకునేందుకు ఈ ఎలక్ట్రిక్ చెప్పులను రూపొందించారు. వీటిని తయారు చేసింది ఏ సైంటిస్టో.. ప్రముఖ కంపెనో కాదు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తయారు చేశాడు. దీనికి విమెన్ సేప్టీ డివైజ్ అని పేరు పెట్టాడు. పదండి వివరాల్లోకి వెళ్లి పూర్తిగా తెలుసుకుందాం. ఝార్ఖండ్​లోని ఛత్రాకు చెందిన మంజీత్​కుమార్ ఇంటర్మీడియేట్​మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బస్సుల్లో, రోడ్ల మీద, ఆఫీసుల్లో ఎక్కడపడితే అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ఎదుర్కొనేందుకు, నిస్సహాయ స్థితిలో భద్రత కోసం విద్యార్ధి వినూత్న ఆవిష్కరణ చేశాడు. కాళ్లకు వేసుకునే మామూలు చెప్పులను కరెంట్​చెప్పులుగా తయారు చేశాడు. అదీ అతి తక్కువ ధరలో వాటిని తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. వీటిని వేసుకొని బయటకు వెళ్తే ఎటువంటి ఆపద వచ్చిన ఎదుర్కోగలమనే ధైర్యం మహిళలకు వస్తుందంటున్నాడు ఈ ఝార్ఖండ్ కుర్రాడు. నిర్భయ వంటి విషాదకర ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకే దీనిని రూపొందించానని చెబుతున్నాడు.

ఎలా రూపొందించాడంటే..?
సాధారణంగా మనం వేసుకునే చెప్పులనే ముడిసరుకుగా వినియోగించాడు. చెప్పుల కింది భాగంలో నాలుగు బ్యాటరీలు, స్విచ్ సహా మరికొన్ని చిన్న పరికరాలను అమర్చాడు. కేవలం అరగంట ఛార్జింగ్​పెడితే చాలు రెండు రోజుల వరకు ఈ చెప్పులను వాడుకోవచ్చు. రూ.500లకే ఈ డివైజ్‌ను తయారు చేయడం మరో విశేషం.

ఎలా పనిచేస్తుందంటే..?
మహిళలు, బాలికలు వేధింపులు ఎదురైన సమయంలో ఈ ఎలక్ట్రిక్​ చెప్పులతో వారిని తంతే కరెంట్ షాక్​ తగిలి అక్కడే కిందపడిపోతారు. కనీసం 220 నుంచి 300 వోల్ట్​ల షాక్​ వారికి తగులుతుంది. ఆ గ్యాప్‌లో బాధిత మహిళ అక్కడి నుంచి పారిపోవచ్చు.

ఇది కూడా చదవండి…
సూపర్ స్టార్‌తో పైలెట్..!
– రజనీకాంత్ ఇంటికి వెళ్లిన రోహిత్ రెడ్డి భేటీ
– గృహప్రవేశానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే
https://dharshininews.com/17449

chaithany collage