నిస్వార్థ సేవలు అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

నిస్వార్థ సేవలు అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరోనా విజృంభణ సమయంలో నిస్వార్థంగా అందించిన సేవలు ఎంతో అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పట్టణ ప్రగతి సంబరాలలో తాండూరుకు చెందిన ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభినందించి సన్మానించారు. కరోనా సమయంలో అసోసియేషన్ సభ్యులు పీపీ కిట్లు ధరించి కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా ఎంతో నిస్వార్థంగా సేవలు అందించడం అభినందనీయని అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, వర్కింగ్ సభ్యులు ఇంతియాజ్ తదితరలను సన్మానించారు. స్ఫూర్తివంతమైన సేవలు అజరామరంగా నిలుస్తాయన్నారు. అనంతరం ఉత్తమ సేవా అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు, నేతలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage