పాన్‌తో ఆధార్ లింకు చేయకుంటే అంతే..!
– ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిందో తెలుసా..?
– వెంటనే లింకు చేసుకోవాంటున్ననిఫుణులు
దర్శిని డెస్క్: ఆధార్.. పాన్.. ఈ రెండు అనుసంధానం లేకుంటే కష్టాలు తప్పవంటున్నారు నిపుణులు. పాన్‌తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన జూన్ 30 గడువు ముగిసినందున, లింక్‌కాని పాన్ కార్డులు జూలై 1 నుంచి పనికిరావు. ఆదాయపు పన్ను నిబంధనల్లోని రూల్ 114బి ప్రకారం పలు రకాల లావాదేవీలకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
బ్యాంకులో ఎదురయ్యే కష్టాలు
పాన్ కార్డు చెల్లకపోతే బ్యాంక్ ఖాతాలో రూ.50,000 మించి డిపాజిట్ చేయడం జరగదు. అంతే మొత్తానికి మించి బీమా ప్రీమియం చెల్లించాలన్నా వీలు పడదు.బ్యాంక్‌లో కొత్త ఖాతాను తెరవడం కుదరదు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌కు దరఖాస్తు చేయడం సాధ్యం కాదు. డిపాజిటరీతో డీమ్యాట్ ఖాతాను తీసుకోవడానికి ఇబ్బందులు. హోటల్ లేదా రెస్టారెంట్‌లో రూ.50,000 మించి బిల్లును నగదుతో చెల్లించడం ఆటంకాలు.
ఏ విదేశీ ప్రయాణానికైనా రూ.50,000 మించి నగదును చెల్లించడం లేదా విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడం జరగదు.మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోలుకు రూ. 50,000 మించి చెల్లించడం, బాండ్లు, డిబెంచర్ల కొనుగోలుకు ఏదైనా కంపెనీకి లేదా సంస్థకు రూ. 50,000 మించి చెల్లింపుచేయడం వంటివి వీలు పడవు.
డిపాజిట్ కష్టాలు
బ్యాంక్ లేదా సహకార బ్యాంక్‌లో ఒకే రోజున రూ.50,000 మించిన నగదు డిపాజిట్ చేయడం కుదరదు. బ్యాంక్ డ్రాఫ్ట్‌లు లేదా పే ఆర్డర్లు లేదా బ్యాంకర్స్ చెక్‌లను తీసుకోవడానికి 50వేలు మించిన మొత్తాన్ని చెల్లించడం జరగదు. ఆర్బీఐ జారీచేసే ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ కోసం రూ.50,000 మించి ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా పే ఆర్డర్ లేదా చెక్ ద్వారా చెల్లించడం జరగదు. బ్యాంక్ లేదా కో ఆపరేటివ్ బ్యాంక్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో 50వేలు మించి టర్మ్ డిపాజిట్ చేయడం కుదరదు. జీవిత బీమా ప్రీమియంగా ఒక ఆర్థిక సంవత్సరంలో బీమా సంస్థకు రూ.50,000 మించి చెల్లించడం జరగదు. స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్‌కాని కంపెనీల షేర్లను ఒక లావాదేవీలో రూ.1 లక్షకు మించి కొనడం లేదా విక్రయించడం సాధ్యం కాదు. ఒక లావాదేవీలో రూ.1 లక్షకు మించి సెక్యూరిటీల (షేర్లు కాకుండా) కొనుగోలు లేదా అమ్మకం జరగదు.
అధిక పన్ను భారం
పాన్ ఇన్‌ఆపరేటివ్ అయితే కొన్ని ఆర్థిక లావాదేవీలకు పన్ను అధికంగా చెల్లించాల్సి వస్తుంది. టీడీఎస్‌లో ఎక్కువ కోత పడుతుంది. టీసీఎస్‌ను అధికంగా చెల్లించాలి. వాహన క్రయ విక్రయాలలో రూ.10 లక్షలకు మించిన స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకంపై పన్ను చెల్లించాలి. ఐటీ యాక్ట్ సెక్షన్ 50సిలో స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ నిర్దేశించిన ఆస్తి విలువ రూ.10 లక్షలకు మించితే, స్థిరాస్తి మినహా ఏ ఇతర వస్తువులు, సర్వీసుల కొనుగోలు లేదా విక్రయం రూ. 2 లక్షలకు మించితే కూడా పన్ను భారం మోయాల్సిందే.
ఇది కూడా చదవండి…
https://dharshininews.com/18449


