మంత్రి గారు.. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రండి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

మంత్రి గారు.. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రండి
– మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ను ఆహ్వానించిన నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : గౌడ కుల‌స్తుల దైవం స‌ర్దార్ స‌ర్వాయ్ పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ముఖ్య అతిథిగా ర‌వాల‌ని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ను తాండూరు గౌడ సంఘం నాయ‌కులు కోరారు. మంగ‌ళ‌వారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో తాండూరు గౌడ సంఘం అధ్యక్షులు రాజుగౌడ్ ఆధ్వర్యంలో గౌడ నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 28న తాండూరులో సర్దాన్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ నిర్వహిస్తున్నట్లు నాయకులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్ పాల్గొంటారని చెప్పారు. అనంతరం నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు గౌడ సంఘం నాయకులు హరిహరగౌడ్, సంతోష్ గౌడ్ తదితరులు ఉన్నారు.