రేపు తాండూరులో పవర్‌ కట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరులో పవర్‌ కట్..!
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. శనివారం తాండూరు పట్టణ విద్యుత్ ఏఈ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా స్థంభించి పోతుందన్నారు. తాండూరు పట్టణంలోని 33/11కేవీ సబ్‌ స్టేషన్‌లో ఫీడర్స్‌, యాడ్ మెయింటెన్స్‌ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులు, ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ అంతరాయ నిర్ణయం వాయిదా
విద్యుత్ అంతరాయంపై అధికారులు మరో ప్రకటన చేశారు. ఆదివారం తాండూరు పట్టణంలో ఆషాఢ బోనాల పండగ సందర్భంగా నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు మరో ప్రకటన విడుదల చేశారు. పట్టణ ప్రజల అభిప్రాయం మేరకు విద్యుత్ అంతరాయాన్ని మళ్లీ వచ్చే ఆదివారానికి మారుస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage