పీఎంఆర్‌వి క్రిమినల్‌ మైండ్ పాలిటిక్స్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పీఎంఆర్‌వి క్రిమినల్‌  మైండ్ పాలిటిక్స్‌..!
– మహేందర్ రెడ్డిపై కీలక వాఖ్యలు
– పైలెట్‌పై కూడా మండిపడిన ఎం.రమేష్‌ మహరాజ్
– వచ్చే ఎన్నికల్లో చాన్స్‌ ఇవ్వాలని అభ్యర్థన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి(పీఎంఆర్)పై కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.రమేష్‌ మహరాజ్ కీలక వాఖ్యలు చేశారు. పీఎంఆర్ క్రిమినల్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని సిండీకేట్‌ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ మహరాజ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు తాండూరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి గతంలో క్రిమినల్ రాజకీయాలకు పాల్పడ్డారని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.

ఈ సారి కూడా మహేందర్ రెడ్డి తన క్రిమినల్‌ మైండ్‌తో పోలిటికల్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. టీడీపీలో వాళ్లే.. బీఆర్ఎస్‌లో వాళ్లే.. కాంగ్రెస్‌లో వాళ్లే ఉంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలో పార్టీ బలంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మహేందర్ రెడ్డి అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌లో వస్తున్నారంటూ లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారని, అలాంటి వాటిని నమ్మొద్దన్నారు. ఆయన క్రిమినల్‌ మైండ్, డబ్బు రాజకీయాలను ఎవ్వరు తట్టుకోరని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అవకాశం ఇస్తే కేవలం 2875 ఓట్లతో మాత్రమే గెలిచారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచినా ఆయన చేసిన ఘనకార్యమేమి లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు టిక్కెట్టు రాదని ఫేక్ సర్వేలతో మభ్య పెడుతున్నారని, ఇకనైనా దొంగ సర్వేలు ఆపాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మహరాజుల కుటుంబం అనే గుర్తింపు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తనకే టిక్కెట్టు వస్తుందని, ఎన్నికల్లో గెలిపిస్తే తండ్రి మాణిక్ రావు, బాబాయి మాజీ ఎమ్మెల్యే నారాయణ రావులకు మించి పాలన చేస్తానని అన్నారు. ఎన్నికల్లో గెలిపించేందుకు ఒక్క అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.
వీడియో కూడా ఉంది చూడండి..

 

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage