టీయూడబ్ల్యూజే గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటి సభ్యులు శ్రీనివాస్ చారి

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

టీయూడబ్ల్యూజే గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటి సభ్యులు శ్రీనివాస్ చారి
– రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా నియామకపత్రం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర సబ్ కమిటి గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటి సభ్యులుగా యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి నియామకం అయ్యారు. సోమవారం జరిగిన రాష్ట్ర యూనియన్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ శ్రీనివాస్ చారికి నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి వెంకట్ రెడ్డి, మెడ్చల్ జిల్లా అధ్యక్షులు బాలరాజ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రామి రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉల్ నబీ