ఎమ్మెల్యేకు యాగ అర్చకుల ఆశీర్వాదం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యేకు యాగ అర్చకుల ఆశీర్వాదం
– మంత్రిగా పదవి పొందాలని దీవేన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని యాగ అర్చకులు దీవించారు. గతనెల తాండూరులోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నూతన నివాసం వద్ద కామాక్షీ పీఠం ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు శ్రీ రాజశ్యామల, శతచండి. సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పార్టీ టిక్కెట్టు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే పైలెట్ రెడ్డిని యాగ పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఆర్ శివకార్తిక్ శాస్త్రి, డాక్టర్ రాజశేఖర్ శాస్త్రీ అర్చక బృందం కలిసి ఆశీర్వదించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని, అదిరోహించాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి..

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!