మోగిన ఎలక్షన్ నగారా..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మోగిన ఎలక్షన్ నగారా..!
– తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్
– ప్రకటించిన ఎన్నికల కమిషన్
దర్శిని డెస్క్ : దేశంలోని తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాలలో ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ నవంబర్ 3 2023. దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 10 2023. దరఖాస్తుల ఉపసంహరణ,నవంబర్ 15 2023. దరఖాస్తుల స్క్రూటినీ: నవంబర్ 13 2023. పోలింగ్ తేదీ: నవంబర్ 30 2023. ఎన్నికల కౌంటింగ్: డిసెంబర్ 3 2023 జరుగుతుండగా.. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు ప్రచారం నిలిచిపోతుంది.