జిల్లా ఆసుపత్రిపై తప్పుడు ప్రచారం తగదు

తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లా ఆసుపత్రిపై తప్పుడు ప్రచారం తగదు
– దవాఖానను ఎక్కడికి తరలించడం లేదు
– అవగాహన లేని ఆరోపణలు మానుకోవాలి
– కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు.

తాండూరులోని జిల్లా ఆసుపత్రిని వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలును ఆయన ఖండించారు. బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు అవగాహన లేని విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఆసుపత్రిని ఎక్కడికి తరలించడం లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని డీఎంఈ పరిధిలోకి మారుస్తున్నారని, ఈ వీలినం వల్ల జిల్లా ఆసుపత్రి మెరుగు పడుతుందని అన్నారు. వైద్యులతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రి జిల్లా వైద్య విధాన పరిషత్ ఉండగా పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిని మెరుగు పరిచేందుకు కృషి చేస్తుందని అన్నారు. జిల్లా ఆసుపత్రి విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాద్దాంతం చేయడం మానుకోవాలని అన్నారు.

మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలి