నామినేషన్ బోణీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నామినేషన్ బోణీ..!
– కాంగ్రెస్ నుంచి దాఖలు
– మొదటి విడత వేసిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో భాగంగా నామినేషన్ బోణీ అయ్యింది. శనివారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ నామినేషన్ దాఖలయ్యింది. ఆ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మొదటి విడత నామినేషన్ ను దాఖలు చేశారు. తాండూరులోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయానికి మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి వెళ్లారు. నిబంధనల మేరకు ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాస్ రావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మనోహర్ రెడ్డి వెంట కుటుంబ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..