మత్తడి దూకిన జుంటుపల్లి వాగు
– ప్రాజెక్టులోకి భారీగా వరధనీరు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తుఫాన్ ప్రభావంతో తాండూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో నియోజకవర్గంలోని యాలాల మండలం జుంటుపల్లి వాగులోకి భారీగా వరధనీరు చేరింది. ప్రాజెక్టు అలుగు పైనుంచి వరధనీరు మత్తడి దూకి ప్రవహించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరధనీరు వస్తుండడంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటోంది. మరోవైపు యాలాల మండలంలోని కాగ్నానది, పలు గ్రామాల్లోని వాగులు, చెరువులలోకి కూడ వరధనీరు చేరుకుంది.


