దుర్గామాత సేవలో పట్లోళ్ల బాల్ రెడ్డి
– అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన దంపతులు
– సాయిపూర్‌లో శరన్నవరాత్రుల శోభ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా రెడ్డి దంపతులు దుర్గామాత సేవలో తరించారు. పట్టణంలోని సాయిపూర్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

సోమవారం బోనమ్మ గుడి వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి సతీమణి మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజారెడ్డితో కలిసి దర్శించుకున్నారు. వేదమంత్రోచ్చరణల మద్య దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

దుర్గామాత శరన్నవ రాత్రులను ప్రజలంతా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని అన్నారు. అనంతరం మండలం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

