ఇంటింటి నుంచి గ్యారెంటీ ఆర్జీలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటింటి నుంచి గ్యారెంటీ ఆర్జీలు..!
– మున్సిపల్‌లో రెండో రోజు భారీ స్పందన
– ఆరు వార్డుల్లో 2481 దరఖాస్తుల స్వీకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రవేశ పెట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు తాండూరు మున్సిపల్ పరిధిలో భారీ స్పందన లభిస్తోంది. రెండో రోజు శుక్రవారం నిర్ణీత వార్డులలో అర్హులు ఇంటింటి నుంచి ఆర్జీలను సమర్పించారు. పట్టణంలోని 7వ, 8వ, 9వ, 10, 11, 12వ వార్డులలో దరఖాస్తుల స్వీకరణ ఉత్సహాంగా కొనసాగింది. మూడు ప్రత్యేక బృందాలతో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో అధికార్థులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు.

7వ వార్డులో 547, 8వ వార్డులో 687, 9వ వార్డులో 467, 10వ వార్డులో 311, 11వ వార్డులో 274, 12వ వార్డులో రాత్రి వరకు 195 నమోదు కాగా దరఖాస్తులు దారులు సమయం దాటిన బారులు తీరారు. దీంతో మొదటి రోజు నిర్ణీత సమయానికి మొత్తం 2481 దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు వెల్లడించాడు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, కౌన్సిలర్లు, కమిషనర్ షఫీఉల్లా, మేనేజర్ సరేందర్ రెడ్డి, డీఈ ఖాజా హుస్సేన్, పలు శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం