అవినీతి లేకుండా ఆరు గ్యారెంటీలు
– అభయ హస్తానికి దరఖాస్తులు చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని 31, 32, 33వ వార్డులలో జరిగిన అభయ హస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు లావణ్య, లత గౌడ్, ప్రవీణ్ గౌడ్ లతో కలిసి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన తాండూరు ప్రజల సేవకు కృషి చేస్తానని అన్నారు.
తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా -అభివృద్ధి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా అభయ హస్తం ద్వారా లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి దరఖాస్తు దారునికి అవినీతి లేకుండా పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, సాయిపూర్ బాల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, లింగదలి రవికుమార్, ప్రత్యేకాధికారి వినయ్ కుమార్, కమీషనర్ షఫీవుల్లా, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ ఖాజా, సిబ్బంది. నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

