హస్తం గూటికి చేరిన సునీతమ్మ
– గాంధీభవన్‌లో కండువా వేసుకున్న జెడ్పీ చైర్ పర్సన్
– కుమారుడు రినీష్ రెడ్డి కూడా పార్టీలో చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి హస్తం గూటికి చేరారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన రాజీనామ లేఖకు మాజీ సీఎం కేసీఆర్‌కు పంపించారు. అనంతరం హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో టీకాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు కుమారుడు రినీష్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా వేసుకున్నారు.
చేవేళ్ల లోక్‌సభ సీటుపై హామీతోనే పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి. చేవేళ్ల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ తరపున బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో.. కాంగ్రెస్ కూడా నియోజకవర్గంపై పట్టున్న పట్నం ఫ్యామిలీని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దఫాలు చర్చలు జరిపిన పట్నం కుటుంబసభ్యులు ఎట్టకేలకు ఎంపీ సీటు కోసం లైన్ క్లియర్ కావడంతో సునీతా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి సునీతా మహేందర్ రెడ్డి, కుమారుడు రినిష్ రెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇది కూడా చదవండి…

