సార్లు వస్తున్నారు..!
– తాండూరుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్
– సభల తేదీలను ఖరారు చేసిన బీఆర్ఎస్
తాండూరు, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తోంది. ప్రచారానికి రోజులు దగ్గర పడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ సభలు, సమావేశాలతో దూసుకుపోతోంది. ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని వికారాబాద్ జిల్లాలో గులాబీ బాసులతో సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చేవారం రోజులలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటనలు నిర్వహించేందుకు పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు తాండూరులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటనలకు ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. ఈనెల 22న తాండూరులో సీఎం కేసీఆర్, 26న మంత్రి. కేటీఆర్ పర్యటన ఉంటుందని తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాండూరులో సీఎం కేసీఆర్, మంత్రి పర్యటనలను జయప్రదం చేస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి…

