చల్లని కబురు..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

చల్లని కబురు..!
– నేడు, రేపు తేలికపాటి వర్షాలు
– ప్రకటించిన వాతావరణ శాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వేసవి ప్రభావం కనిపిస్తోంది. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాష్ట్ర వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి వేసవిలో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!