ఎంపీగా ఆలోచన లేదు కానీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎంపీగా ఆలోచన లేదు కానీ..!
– ఆ పదవి కోసం ప్రయత్నం
– పైలెట్ రోహిత్ రెడ్డి మనసులో మాట
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పైలెట్ రోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారనే ప్రచారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రచారంపై రోజుకో ట్విస్టులు వస్తున్నాయి. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. తనకు చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. కాని వికారాబాద్‌ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో పార్టీకి ముందుకు నడిపించాలని ఉత్సహాం ఉందన్నారు. పార్టీ బలోపేతం చేయాలని ఆశ బలంగా ఉందన్నారు. త్వరలోనే తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్ బరిలో పోటీ చేస్తారని పైలెట్ రోహిత్ వర్గీయులు ఇంకా దీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!