తాండూరులో జైపూర్, కెలిఫర్ అమరిక క్యాంపు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో జైపూర్, కెలిఫర్ అమరిక క్యాంపు
– రిజిస్ట్రేషన్ చేసుకున్న వికలాంగులకు ఉచిత సేవలు
– ప్రకటించిన మార్వాడి యువమంచ్ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వికలాంగులకు ఉచిత జైపూర్ కాళ్లు, కెలిఫర్ కాళ్ల అమరిక క్యాంపు నిర్వహిస్తున్నట్లు తాండూరు మామార్వాడి యువమంచ్ సభ్యులు తెలిపారు. మార్వాడి యువమంచ్, యాలాల మండలం జక్కెపల్లిలోని రాడికల్ బయో – ఆర్గానిక్ లిమిటెడ్ ఫ్యాకర్టీ సంయక్త ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13వ తేదిల్లో పట్టణంలోని బాలాజీ మందిరంలో క్యాంపు కొనసాగుతుందన్నారు. ముందుగా అంగవైకల్యం కలిగిన వికలాంగుల నుంచి కొలతలు తీసుకోవడం జరుగుతుందని, 200ల మందికి ఈ సేవలను అందించడం జరుగుతుందన్నారు.

శిభిరానికి వచ్చే వికలాంగులు తమవెంట ఆధార్కార్డు, అంగవైకల్యం కలిగిన రెండు పాసో ఫోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకరావాల్సి ఉంటుందని సూచించారు. వికలాంగులు రిజిస్ట్రేషన్ కోసం బ్రిజ్ మోహన్ బూబ్(సెల్:9989495561), కిషన్ రాఠి(సెల్: 9885934446), అరుణ్‌ సర్డా(సెల్: 9948323044), కరణ్‌ జైన్(సెల్: 9885222511), సుధు పసారి(సెల్: 9885277560)లకు సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞఫ్తి చేశారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!