సంతోషాన్ని పంచేందుకు బతుక‌మ్మ సారే

తాండూరు వికారాబాద్

సంతోషాన్ని పంచేందుకు బతుక‌మ్మ సారే
– టీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడ‌ర్ అబ్దుల్ ర‌జాక్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ఆడ‌ప‌డుచుల‌కు పండ‌గ సంతోషాన్ని పంచేందుకు స‌ర్కారు నుంచి సారే రూపంలో చీర‌ల‌ను అంద‌జేస్తుంద‌ని తాండూరు మున్సిప‌ల్ మాజీ ఫ్లోర్ లీడ‌ర్, కౌన్సిల‌ర్ అబ్దుల్ ర‌జాక్ అన్నారు. శ‌నివారం త‌న వార్డులోని మ‌హిళ‌ల‌తో పాటు అర్హులైన యువ‌తుల‌కు రేష‌న్ దుకాణం వ‌ద్ద బతుక‌మ్మ చీర‌లను పంపీణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వానికి పెద్ద‌పీట వేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌న్నారు. ప్ర‌తి యేడాది బ‌తుక‌మ్మ పండ‌గ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను అంద‌జేస్తుంద‌ని, ఆడ‌ప‌డుచుల ముఖాల్లో చిరున‌వ్వు, సంతోషం చూసేందుకు చీర‌ల‌ను పంపిణీ చేస్తోంద‌ని అన్నారు. మ‌హిళ‌లు, ఆడ‌ప‌డుచులు సంతోషంగా బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండ‌గ‌ల‌ను జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ ఆర్పీ, ల‌బ్దిదారులు ఉన్నారు.