సారుతో.. బేజారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సారుతో.. బేజారు..!
– డీఆర్‌ ముందు తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌పై అక్కసు
– డాక్యుమెంట్ రైటర్ల, యజమానుల ఫిర్యాదులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ రిజిస్ట్రార్‌ వ్యవహారంతో బేజారు అవుతున్నామని రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్(డీఆర్) సంతోష్ ముందు డాక్యుమెంట్ రైటర్లు, వ్యాపారులు, క్రయ, విక్రయదారులు మొరపెట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రార్ పై పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గురువారం రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతోష్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ విషయం తెలుసుకున్న డాక్యుమెంట్ రైటర్లు, క్రయ విక్రయదారులు భారీగా తరలి వచ్చి డీఆర్ సంతోష్ ను కలిసి సబ్‌ రిజిస్ట్రార్‌ వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు సబ్ రిజిస్ట్రార్ పుర్యా రిజిస్ట్రేషన్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

పేర్లలో, దృవపత్రాలలో పొరపాట్ల పేరుతో రిజిస్ట్రేషన్లు జరగకుండా చేస్తున్నారని డీఆర్ దృష్టికి తెచ్చారు. ఆదేవిధంగా చలాన్లు కట్టించి.. రిజిస్ట్రేషన్లను ఆపివేస్తున్నారి, రీఫండ్ చేయకుండా వేధిస్తున్నారని తెలిపారు. రిజిస్ట్రార్ వేధింపుల నుంచి పరిష్కారం చూపించాలన్నారు. అదేవిధంగా కార్యాలయంలో బ్యాటరీలు, విద్యుత్ అంతరాయం వల్ల రిజిస్ట్రేషన్లకు ఆంటకం కలుగుతుందన్నారు. రోజుల తరబడి రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డీఆర్ ను కోరారు. అనంతరం డీఆర్ సంతోష్ మాట్లాడుతూ రాత పూర్వకంగా వినతిపత్రాలు అందించాలని, కమీషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదు దారులతో కార్యాలయం కిక్కిరిసి పోయింది.

ఇదికూడా చదవండి…

మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే