వాట్సాప్‌లో కొత్త ఫీచర్

జాతీయం టెక్నాలజీ తెలంగాణ లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్
– త్వరలో లాంచింగ్
– ఎలాంటి ఉపయోగం అంటే..?
దర్శిని డెస్క్‌ : ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ, యూజర్లను ఆకట్టుకోంటోంది వాట్సాప్. ఉపయోగకరమైన ఫీచర్లు అందుబాటులో ఉండడంతో వినియోగదారుల్లో క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకవచ్చిన వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకవస్తోంది. ప్రస్తుతం ఇది ట్రయల్‌లో ఉంది. వాట్సాప్‌లో ఉన్న స్టేటస్ ఫీచర్‌ గురించి అందరికి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫీచర్‌కు ఎంతో ఆదరణ లభించింది. అయితే తాజాగా వాట్సాప్‌ ఈ స్టేటస్‌ విభాగంలో ఓ ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ను తీసుకొస్తోందని తెలుస్తోంది. సాధారణంగా మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరైనా స్టేటస్‌ పెడితే అప్‌డేట్స్‌లోకి వెళ్లి చూస్తే కానీ తెలియదు.

అలా కాకుండా మీ కాంటాక్ట్ లిస్ట్‌ల ఉన్న వారు స్టేటస్‌ పెట్టగానే మీకు అలర్ట్ వస్తే భలే ఉంటుంది కదూ.! వాట్సాప్‌ ప్రస్తుతం ఇదే ఫీచర్‌పై పనిచేస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఏదైనా మెసేజ్‌ వస్తే ఎలాగైతే అప్‌డేట్ వస్తుందో ఇకపై ఎవరైనా స్టేటస్‌ పెట్టినా మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. ఇది యూజర్స్ యాక్టివిటీ, కనెక్టివిటీని పెంచుతుందని కంపెనీ భావిస్తోంది. తొలుత ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఇతర యూజర్లకు ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా వాట్సాప్‌ ఏఐ సేవలను కూడా ప్రారంభించింది. మెటా ఏఐ పేరుతో ఓ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌ బాట్‌ అచ్చంగా చాట్‌ జీపీటీ మాదిరి పనిచేస్తుంది. ఇందులో యూజర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఏ అంశానికి సంబంధించిన ప్రశ్న అడిగినా వెంటనే చాట్‌బాట్ సమాధానం ఇచ్చేస్తుంది.

ఇదికూడా చదవండి…

వేసవిలో గొంతు నొప్పి వేధిస్తుందా..!