బీసీల శాతంపై తప్పుడు లెక్కలు
– మళ్లీ కుల గణన చేసి సరిచేయాల్సిందే
– తరువాతే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలి
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రలో బీసీల జనాభా శాతంపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను అణచివేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. 2014లో బీసీలు 52శాతంగా ఉండగా 2024లో 46శాతంకు చేరిందని ప్రభుత్వం లెక్కలు చూపిస్తుందని, ఈ పదేండ్లలో బీసీలు ఎలా తగ్గుతారని ప్రశ్నించారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాండేందుకు 7శాతం ఉన్న ఓసీల జనాభాను 15.79శాతంకు పెంచారని విమర్శించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు ఉండగా 2024లో కేవలం 4 కోట్లుగా పెరిగి 3.54 కోట్ల జనాభా ఉన్నట్లు ప్రకటించడంలో అంత్యరేమిటి అని అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి సర్వే సక్రమంగా జరగలేదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అప్పుడే చెప్పారని, ప్రస్తుతం ప్రభుత్వం చూపిన లెక్కలు నిజం చేస్తున్నాయన్నారు.
ఎన్నికల కోసం ప్రభుత్వం తప్పుడు లెక్కలు ప్రకటించిందని ద్వజమెత్తారు. 4 కోట్లకు పైగా ఉన్న తెలంగాణ జనాభాలో బీసీలు 60శాతంకు పైగా ఉంటారని అన్నారు. రాష్ట్రంలో మరోసారి బీసీల కుల గణన చేపట్టి తీరాలన్నారు. 100శాతం లెక్కలు చేసిన తరువాతే క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలనని అన్నారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి…

