శ్రీరామ ‘భక్తుల’ సేవలో మహారాష్ట్ర వాసి.!

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీరామ ‘భక్తుల’ సేవలో మహారాష్ట్ర వాసి.!
– 41వ ఏటా జుంటిపల్లిలో అన్నదానం
– ఎఫ్ఎస్ గిరి ద్రాతృత్వానికి ఎమ్మెల్యే ఫిదా
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి బంధువు, ఆదుకునే ప్రభువు అయిన శ్రీరామ భక్తుడు గత 40 ఏండ్లుగా శ్రీరామ భక్తుల సేవలో సంతృప్తి చెందుదున్నారు. యాలాల మండలం జుంటుపల్లిలో వెలసిన భక్తులకు అన్నదానం చేస్తూ సేవా తత్పరతను చాటుకుంటున్నారు. శ్రీరామ నవమి వచ్చిందంటే మహరాష్ట్ర నుంచి ఇక్కడ వాలిపోయి సేవను కొనసాగిస్తున్నాడు. మహారాష్ట్ర పూణేకు చెందిన రామభక్తుడు ఎఫ్ ఎస్ గిరి తన భక్తిని చాటుకొన్నాడు.

చిన్నపాటి తో ప్రారంభించి తాను చేపట్టిన అన్నదానం కార్యక్రమాన్ని 41 వ ఏటా కొనసాగించాడు. బుధవాం జరిగిన శ్రీ సీతా -రాముల కళ్యాణం లో భాగంగా ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. వ్యాపారరీత్యా మహారాష్ట్ర లో స్థిరపడ్డా.. పగిడిపల్లి కి చెందిన ఎఫ్ ఎస్ గిరి పుట్టిన గడ్డకు, అదేవిధంగా శ్రీ రాముని సేవలో అన్నదాన కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా కొనసాగించడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు. అతని సేవా గుణాన్ని మెచ్చుకుని ఫిదా అయ్యారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పరిగి కి చెందిన ఎర్రగడ్డపల్లి సత్తయ్య,హైదరాబాద్ కు చెందిన కిరణ్ మైలే, కొకట్ పురుషోత్తం రెడ్డి,ఆర్ వీ రెడ్డి,దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం