అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

తాండూరు రాజకీయం వికారాబాద్

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
– సాయిపూర్లో మార్మోగిన శ్రీరామ నామం
– పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లో శ్రీరామ నామస్మరణ మార్మోగింది. బుధవారం సాయిపూర్లో శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా కాలనీలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సంలో రాముని తరుపున బంటు లక్ష్మీ, బంటు మల్లప్ప దంపతులు పాల్గొనగా సీతాదేవి తరుపున పట్లోళ్ల మమత, పట్లోళ్ల గంగాదర్ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు సీతారాములను ఊరేగింపుగా కళ్యాణ నుండపానికి తీసుకవచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణ మద్య పురోహితులు సీతారాముల కళ్యాణోత్సవాన్ని జరిపించారు. కళాణోత్సవాన్ని తరలివచ్చిన భక్తులు సీతారాముల పెండ్లిని చూసి పులకించారు.

జయ జయ ద్వానాలతో శ్రీరాముని నామ స్మరణతో సాయిపూర్ మార్మోగింది. అదేవిధంగా సాయిపూర్ జరిగిన సీతారాముల కళ్యాణోత్సవానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి హాజరయ్యారు. మరోవైపు కళ్యాణోత్సవం అనంతరం సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ సహాకారంతో ఏర్పాటు చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో -మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, గోశాల అధ్యక్షులు పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు నీరబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, నాయకులు ఇందూరు రాములు, బంటు వేణుగోపాల్, సాయిపూర్ పెద్దలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రామ రాజ్యమే రావాలి