రైల్వే బ్రిడ్జి పనులకు బ్రేక్..!
– పనులు ఆపాలని హైకోర్టు స్టే
– శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులకు తాత్కాళికంగా బ్రేక్ పడింది. పనులను యధాస్థితిలో ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవలే పాత తాండూరులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. ఈ మార్గంలో ఫ్లైఓవర్ కు బదులు ఆర్యూబి(అండర్ బ్రిడ్జి)ని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆర్ఓబి కారణంగా పాతతాండూరు ప్రాంతంలోని పేదలకు చెందిన ఇళ్లు పెద్ద సంఖ్యలో కోల్పోవాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాండూరుకు చెందిన బాధిత కుటుంబ సభ్యురాలు సూరజ్ కాంత సార్డా అనే మహిళ హైక్టరులో పనులు నిలిపివేయాలని ఫిటీషన్(9250/2024) దాఖలు చేశారు. ఇందుకు హైకోర్టు న్యాయమూర్తి రైల్వే బ్రిడ్జి పనులు నిలిపివేయాలని స్టే విధించారు.

పనుల విషయంలో యధాస్థితిని కొనసాగించాలని రైల్వే శాఖతో పాటు రెవెన్యూ, ఆర్అండ్్బ, మున్సిపల్ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని తాండూరుకు చెందిన సామాజిక కార్యకర్త రాజ్ గోపాల్ సార్థా ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో పాత తాండూరులోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులకు తాత్కాళికంగా బ్రేక్ పడింది. ఈ నిర్ణయంతో స్థానిక బాధితులు కాస్త ఊరట చెందారు. మరోవైపు ఇదే విషయంలో చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైల్వే జీఎంకు లేఖ రాసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కాని ఓ బాధితురాలు హైకోర్టులో చేసిన ఫిర్యాదుకు స్పందన రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇదికూడా చదవండి…

