ఆద‌ర్శ‌నీయుడు మ‌హారాణా ప్ర‌తాప్

తాండూరు వికారాబాద్

ఆద‌ర్శ‌నీయుడు మ‌హారాణా ప్ర‌తాప్
– ఘ‌నంగా జ‌యంతి వేడుక‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశ ఆత్మ గౌరవం కోసం మొఘలులతో పోరాడిన మహనీయుడు మహారాణా ప్రతాప్ అంద‌రికి ఆద‌ర్శ‌నీయుడు అని రాజ్‌పుత్‌లు పేర్కొన్నారు. సోమ‌వారం తాండూరు ప‌ట్ట‌ణం ఇందిరాన‌గ‌ర్‌లోని భ‌వాని మాత ఆలయంలో మ‌హారాణా ప్ర‌తాప్ సింగ్ 482 జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. రాజ్ పుత్ సంఘం ఆధ్వ‌ర్యంలో జెండా ఆవిష్క‌ర‌ణ చేసి వేడుక‌లు నిర్వ‌హించారు. అనంతరం తాండూరు బస్ స్టేషన్ లో ఉప్మా, మజ్జిగ వితరణ చేశారు. ఈ సంద‌ర్భంగా రాజ్ పుత్ సంఘం అధ్యక్షుడు టీ.మహేశ్ సింగ్, మహిళ అధ్యక్షురాలు నిఖిత ఠాకూర్, సభ్యులు సంగీత ఠాకూర్, జగన్ సింగ్, రఘువీర్ సింగ్, జోతి సాంఘ సభ్యులు మాట్లాడుతూ రాజ్ పుత్ సంఘా బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. వచ్చే యేడాదికి మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహా ప్రతిష్టాపనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.