ఇంటర్ రిజల్ట్ డేట్ ఫిక్స్..!
– తేదీని ప్రకటించిన ఇంటర్ బోర్డు
– ఎక్కడ చేసుకోవాలో అలెర్ట్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు అలర్ట్ చేసింది. పరీక్ష ఫలితాల రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసినట్లు ప్రకటించింది. గతనెలలో తెలంగాణలో ఇంటర్మీడియేట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు కొనసాగాయి. పరీక్షలు పూర్తి కావడంతో ఈ నెల 10వ తేదీ వరకు మూల్యాంకణం పూర్తి ప్రక్రియ పూర్తయ్యింది.
దీంతో ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపింది. గత సంవత్సరం మే 9న ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సారి 15 రోజుల ముందే ఫలితాలను వెల్లడించాలని బోర్డు నిర్ణయించింది. అందుకు మూల్యాంకణం కూడా కూడా వేగంగానే చేపట్టింది.

ఫలితాల కోసం https://tv9telugu.com/, tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఇదికూడా చదవండి…

