ఓటర్ల వెర్రీ..!
– ఇన్‌స్ట్రా, వాట్సాఫ్ లలో ఓటేసిన పోస్టింగ్స్
– తాండూరు ఓటర్లు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు వెర్రి తనాన్ని ప్రదర్శించారు. పార్టీ ఏ పార్టీకి వేశారో తెలుపుతూ వీడియోలు, ఫోటోలు తీసుకుని సోషల్ మీడీయాలో పోస్టులు చేశారు. దీంతో వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రాంలలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన తాండూరులో జరిగాయంటూ ఇంకొందరు పోస్టులు చేయడం చర్చనీయాంశంగా మారింది. గురువారం తాండూరులో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొందరు సెల్ ఫోన్లను దొంగతనంగా కేంద్రాలలోకి తీసుకెళ్లి వీడియోలు, ఫోటోలు తీసుకున్నట్లు వైరల్ అయిన వీడీయోలు, ఫోటోల ఆధారంగా తెలుస్తోంది. ఇన్ఫ్రా గ్రామ్లో అప్పూ-కింగ్- 007 అనే ఐడీ ద్వారా ఓ పార్టీకి ఓటు వేసినట్లు వీడియో పోస్టు చేశాడు. ఇది తాండూరులోనే జరిగినట్లుగా సోషల్ మీడీయాలో వైరల్ అయ్యింది. అదేవిధంగా ఇంకా కొందరు వ్యక్తులు పార్టీలకు వేసినట్లు ఫోటోలు తీసుకుని వాట్సాఫ్ స్టేటస్లు పెట్టుకున్నారు. దీంతో ఓటర్ల తీరు వివాదాస్పదంగా మారింది. ఇదే విషయంపై పోలీసులను వివరణ కోరగా తమ దృష్టికి అలాంటివేమి రాలేదని, విచారణ జరిపి గుర్తిస్తామన్నారు. నిబంధనలకు ఉల్లంఘించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదికూడా చదవండి…

