కన్నుమూసిన సిరివెన్నెల
– తెలుగు చిత్రసీమలో మరో విషాదం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఈనెల 24న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కాగా సినీ పరిశ్రమలో 3000లకు పైగా పాటలు రాశారు.. పదకొండు నంది అవార్డ్స్.. పద్మ శ్రీ అవార్డ్ అందుకున్నారు. సిరివెన్నెల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.
