ఉపసర్పంచ్ రిమాండ్
– సర్పంచ్‌పై దాడికి ఫలితం
తాండూరు, దర్శిని ప్రతినిధి: గ్రామ సర్పంచ్‌పై దాడిచేసిన ఉపసర్పంచ్‌ను తాండూరు రూరల్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈనె12న మండలంలోని మిట్టబాస్పల్లి సర్పంచ్ నరేందర్రెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ గోవింద్ దాడికి పాల్పడడంతో సర్పంచ్ కరణ్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సర్పంచ్ ఫిర్యాదు మేరకు కరణ్ కోట్ పోలీసులు ఉపసర్పంచ్ గోవింద్‌పై రెండు కేసులు నమోదు చేశారు. దీంతో గురువారం ఉపసర్పంచ్ గోవింద్‌ను అదుపులోకి తీసుకుని తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరించారు. అనంతరం నిందితుడు ఉపసర్పంచ్ గోవింద్‌ను రిమాండుకు తరలించినట్లు కరణ్ కోట్ ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. కాగా మిట్ట బాస్పల్లి గ్రామంలో గతకొన్ని నెలల నుంచి సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మద్య రాజకీయ గోడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం చేస్తూ తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మద్య వివాదం పెరిగి సర్పంచ్, ఉపసర్పంచులు దాడులు చేసుకునే స్థాయికి చేరారు.

