పేద‌ల న‌డ్డివిరుస్తోన్న కేంద్రం

తాండూరు వికారాబాద్

పేద‌ల న‌డ్డివిరుస్తోన్న కేంద్రం
– పెట్రోల్ డీజీల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాలి
– యూత్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: పెట్రోల్, డీజీల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ కేంద్రం పేద‌ల న‌డ్డి విరుస్తోంద‌ని తాండూరు యూత్ కాంగ్రెస్ నాయ‌కులు మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపు మేరకు తాండూర్ నియోజకవర్గ యుత్ కాంగ్రెస్ అధ్య‌క్షులు బోయ అశోక్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కావ‌లి సంతోష్ కుమార్, ఉపాధ్య‌క్షులు మోయిన్ అహ‌మ‌ద్‌ల ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు.
ప‌ట్ట‌ణంలోని ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలో నాయ‌కులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేప‌ట్టారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ కేంద్రానికి, ప్ర‌ధాని న‌రేంద్రమోడికి వ్య‌తిరేకంగా బీజేపీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ పెరుగుతున్న పెట్రొల్, డిజిల్ ధరలు సామాన్యులకు తలకు మించిన బారంగా మారిందన్నారు. గత 3 నెలల్లో 16 సార్లు పెట్రొల్, డిజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం పేద‌ల న‌డివిరుస్తోంద‌న్నారు. ఇప్ప‌టికైనా పెంచిన పెట్రోల్, డీజీల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ ప్రాంతాల యూత్ కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.